Apr 7, 2011
ఇలియానా పై అశ్వినిదత్ వేడి ఆరోపణలు
Posted by
Dany1729
at
9:43 AM
ఇలియానాపై అశ్వనీదత్ ఫిర్యాదు చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అయిన చలసాని అశ్వనీదత్ తను నిర్మించగా ఇటీవల విడుదలైన "శక్తి" చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఇలియానాపై ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మండలి (ఎ.పి.ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) లో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఎందుకయ్యా అంటే యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా ద్విపాత్రాభినయంలో నటించగా, ఇలియానా హీరోయిన్ గా నటించగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో తాను నిర్మించిన 45 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం"శక్తి" చిత్రం యొక్క ప్రమోషన్ కోసం హీరోయిన్ ఇలియానా రావటం లేదని అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మండలిలో కంప్లైట్ చేశారట.